కెటిఆర్, రమేష్ లకు ఊరట: కొనసాగవచ్చునన్న సుప్రీంకోర్టు

Supreme Court
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు నుంచి కరీంనగర్ జిల్లా సిరిసిల్ల శాసనసభ్యుడు కెటి రామారావుకు, వేములవాడ శాసనసభ్యుడు చెన్నమనేని రమేష్ కు ఊరట లభించింది. ఉప ఎన్నికలు ముగిశాయి కాబట్టి వారు కొనసాగవచ్చునంటూ చెప్పింది. కేసు కోర్టులో పెండింగులో ఎన్నికలు నిర్వహించరాదని చెప్పిన సుప్రీంకోర్టు ఇప్పటికైతే ఆ రెండు నియోజకవర్గాల ఎన్నికలు పూర్తయ్యాయి కాబట్టి వారు కొనసాగవచ్చునని చెప్పింది. కోర్టులో కేసు పెండింగ్ లో ఉండగా, ఎన్నికలు నిర్వహించరాదని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఎన్నికల సంఘంపై సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది. కోర్టులో కేసు పెండింగులో ఉండగా ఖాళీల అయిన తర్వాత ఆరు నెలల లోపల ఎన్నికలు నిర్వహించాలనే 151ఎ నిబంధన వర్తించదని, అటువంటి స్థానాలకు ఎన్నికలు నిర్వహించకూడదని సుప్రీంకోర్టు తెలిపింది. ఇక ముందు ఈ నిబంధనను పాటించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.

వేములవాడ నుంచి ఎన్నికైన రమేష్, సిరిసిల్ల నుంచి విజయం సాధించిన కెటి రామారావు ఎన్నిక చెల్లదంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై తీర్పు వెలువడక ముందే తెలంగాణ కోసం వారిద్దరు రాజీనామా చేశారు. ఆరు నెలల లోపు ఎన్నికలు నిర్వహించాలనే నిబంధన ప్రకారం ఆ రెండు స్థానాలకు కూడా హైకోర్టులో కేసు పెండింగులో ఉండగానే ఎన్నికలు నిర్వహించారు. తిరిగి ఆ స్థానాల నుంచి వారిద్దరే పోటీ చేసి విజయం సాధించారు. కేసు కోర్టులో పెండింగులో ఉండగా ఉప ఎన్నికలు నిర్వహించడంపై దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు బుధవారం తీర్పు వెలువరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+