వారణాసి పేలుళ్ల కేసును ఛేదించిన పోలీసులు: సూత్రధారుల గుర్తింపు

బాట్లా ఎన్ కౌంటర్ కు దారి తీసిన ఢిల్లీ పేలుళ్లలో షాహనవాజ్ ప్రధాన పాత్ర పోషించినట్లు సమాచారం. సంజర్పూర్ కు చెందిన షాహనవాజ్ ఢిల్లీలోని ఓ నర్సింగ్ హోంలో పనిచేసినట్లు తెలుస్తోంది. బాట్లా ఎన్ కౌంటర్లో మరణించివారు షాహనవాజ్ గ్రామానికి చెందినవారే. ఆజంఘర్ కు ఆ గ్రామం 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అతని సోదరుడు సైఫ్ పేలుళ్ల కేసులో కస్టడీలో ఉన్నట్లు సమాచారం. మరో సూత్రధారి అసదుల్లా డాక్టర్ జావేద్ కుమారుడు. ఢిల్లీ పేలుళ్ల కేసులో తమ పేర్లు ముందుకు రాగానే షాహనవాజ్, అసదుల్లా దుబాయ్ కి పారిపోయారు. వారిద్దరు ఇండియన్ ముజాహిదీన్ వ్యవస్థాపకుడు రియాజ్ భక్తల్ కు అత్యంత సన్నిహితులని చెబుతున్నారు. ఇదిలా వుండగా, కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం వారణాసిలో పేలుళ్లు జరిగిన స్థలాన్ని సందర్శించారు.












Click it and Unblock the Notifications