శాసనసభ నుండి తెరాస ఎమ్మెల్యేల సస్పెన్షన్

తెరాస సభ్యులు ప్రభుత్వానికి, తెలంగాణ కాంగ్రెసు శాసనసభ్యులకు, మంత్రులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థులపై కేసు ఎత్తివేయాలంటూ తెరాస సభ్యులు పలుమార్లు పోడియం వద్దకు దూసుకు వచ్చారు. ప్రభుత్వం తన వివరణ ఇచ్చుకుందని తెరాస పట్టుబట్టడం సరికాదని, నేనే చేయాల్సిందంతా చేశానని నాదెండ్ల అన్నారు. ప్రభుత్వం విద్యార్థులపై కేసులు ఎత్తివేయకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అంతకుముందు తెరాస ప్రభుత్వంపై ధ్వజమెత్తింది. జైళ్లలో ఉన్న విద్యార్థులను వెంటనే విడుదల చేసి, కేసులన్నీ ఎత్తివేయాలని డిమాండు చేశారు. సస్పెన్షన్ తర్వాత తెరాస శాసనసభ్యులు అసెంబ్లీ ఎంట్రన్సు వద్ద బైఠాయించారు. అనంతరం వారు గన్ పార్కు వద్ద తెలంగాణ అమరవీరుల స్థూపం వద్దకు ర్యాలీగా చేరుకున్నారు.












Click it and Unblock the Notifications