అసెంబ్లీలో సిఎం కిరణ్ కు, చంద్రబాబుకు మధ్య తీవ్ర వాగ్వాదం

Kiran Kumar Reddy
హైదరాబాద్: అసెంబ్లీలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి మధ్య సభా సంప్రదాయంపై తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కాంగ్రెసు ప్రభుత్వం రాజకీయాలు చేస్తుందని, కాంగ్రెసు వారు అధికార గర్వంతో విర్రవీగుతున్నారని, మానవత్వం లేదని, రైతుల సమస్యలపై జిల్లాలకు వెళ్లి తేల్చుకుందా రండి అని చంద్రబాబునాయుడు సభలో ఉద్వేగంతో, తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడంతో సభలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో చంద్రబాబుపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రులు పార్థసారథి, మోపిదేవి వెంకటరమణలు ఫైర్ అయ్యారు.

తొమ్మిదిన్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి, సీనియర్ శాసనసభ్యుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు సభా వ్యవహారాలు పాటించకపోవడం సరికాదన్నారు. నాకు ముఖ్యమంత్రి సభా మర్యాదలు చెప్పటం హాస్యాస్పదమని చంద్రబాబు అందుకు తీవ్రంగా స్పందించారు. కిరణ్ కుమార్ రెడ్డి సభాపతిని ఆగౌరవపరుస్తూ మాట్లాడారన్నారు. దీంతో సభలో కాసేపు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికార పార్టీవారు తీవ్రంగా నిరసన తెలిపారు. నేను ఏమీ తప్పు మాట్లాడలేదని, ఏదైనా తప్పు మాట్లాడి ఉంటే దానిని రికార్డులనుండి తొలగించవచ్చని చంద్రబాబు అన్నారు.

చంద్రబాబు సభా మర్యాదలేని వ్యాఖ్యలను విత్ డ్రా చేసుకోకుండా రికార్డులనుండి తొలగించాలని చెప్పటం సరికాదని మంత్రి వట్టి వసంత్ కుమార్ అన్నారు. ఆయన విత్ డ్రా చేసుకున్నట్టు ప్రకటిస్తే హుందాతనంగా ఉండేదన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సభాపతిని ఆగౌరవపర్చలేదని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+