చంద్రబాబు దీక్ష విరమణకు చొరవ చూపండి: ప్రభుత్వానికి చిరంజీవి వినతి
State
oi-Pratapreddy
By Pratap
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి చేత దీక్ష విరమింపజేసేందుకు చొరవ చూపాలని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రైతులకు ఇచ్చిన ప్యాకేజీపై పునరాలోచన చేయాలని కూడా ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఆయన గురువారం చంద్రబాబును నిమ్స్ ఆస్పత్రిలో పరామర్శించారు. చంద్రబాబు ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని ఆయన చెప్పారు. ప్రభుత్వం రైతులకు ప్రకటించిన ప్యాకేజీ ఏ మాత్రం సరిపోదని ఆయన అన్నారు. రైతుల ఆత్మహత్యలు ఇంకా జరుగుతున్నాయని, పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, అందువల్ల ప్రభుత్వం ప్యాకేజీని పెంచాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వం బేషజాలకు వెళ్లవద్దని ఆయన సూచించారు.