మీడియాకు భయపడే వైయస్ జగన్ దీక్షకు వెళ్లలేదు: లగడపాటి

Lagadapati Rajagopal
హైదరాబాద్‌: కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ మరో సంచలన ప్రకటన చేశారు. మీడియా కథనాలకు భయపడే తాను లక్ష్యదీక్ష చేస్తున్న వైయస్ జగన్ ను పరామర్శించడానికి వెళ్లలేదని ఆయన చెప్పారు. బలప్రదర్సనకు దిగినట్లు మీడియా కథనాలు రాయకపోతే వైయస్ జగన్ దీక్షకు మరింత మంది వచ్చి ఉండేవారని ఆయన గురువారం ఓ టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు. వైయస్ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీక్ష చేస్తున్నారా, అనుకూలంగా చేస్తున్నారా అని ఎవరూ ఆలోచించడం లేదని, దీక్ష చేస్తున్నవారిని పరామర్శించడం ఆనవాయితీ అని, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి వద్దకు ముగ్గురు మంత్రులు వెళ్లారని ఆయన అన్నారు.

వైయస్ తనయుడిగా వైయస్ జగన్ పై ఆదరాభిమానాలు ఉన్నాయని, కాంగ్రెసులోకి రావాలంటే వైయస్ జగన్ తిరిగి రావచ్చునని ఆయన అన్నారు. ప్రభుత్వాన్ని పడగొడతామని వైయస్ జగన్ దీక్షకు వెళ్లిన తమ పార్టీ శాసనసభ్యులు ఎవరు చెప్పడం లేదని ఆయన అన్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టబోమని వారు చెబుతున్నారని ఆయన గుర్తు చేశారు. తమ పార్టీకి చెందిన 155 మంది శాసనసభ్యులు కూడా ప్రభుత్వం వెంటే ఉన్నారని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+