వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆసలైన రాజకీయ వారసుడు జగన్: మందకృష్ణ

రైతులు ఆదుకోవాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్న ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని పెంచలేకపోతున్నారన్నారు. రైతాంగ సమస్యలపై జగన్ చిత్తశుద్దితో నిరాహార దీక్ష చేస్తున్నారన్నారు. వైయస్ లో నిజాయితీ, నిబద్దత, ఇచ్చిన మాట నిలబెట్టుకునే దమ్మున్న వ్యక్తి కేవలం వైయస్ రాజశేఖర రెడ్డికి మాత్రమే ఉందన్నారు. వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే గుండెజబ్బులు ఉన్న చిన్నపిల్లలకు వైద్యం చేయించామన్నారు. ప్రజా సంక్షేమం కోసం వేలకోట్లు ప్రకటించారన్నారు. వైయస్ ప్రజా సంక్షేమాన్ని ఆర్థిక కోణంలో కాకుండా మానవీయత కోణంలో చూశారన్నారు. వైయస్ హయాంలో పింఛన్లు పెంచారన్నారు.
జగన్ దీక్షలో నిజాయితీ, నిబద్దత ఉందన్నారు. వైయస్ మరణంతో గుండెపగిలి చనిపోయన వారిని ఓదార్పు పేరుతో ఆదుకున్న నిబద్దత కలిగిన వ్యక్తి జగన్ అన్నాడు. వైయస్ రాజకీయ వారసులం మేమే అనే కాంగ్రెస్ వాళ్లకు ఆయన దగ్గరున్న మానవతా దృక్ఫథం ఏమైందన్నారు. అధికారంలో ఉండి కూడా రైతులను ఎందుకు ఆదుకోలేక పోతున్నారన్నారు. ఎంత డబ్బైనా వెచ్చించి రైతుల కష్టాలు తీర్చేవారన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేస్తున్నదంతా వైయస్ వ్యతిరేక పనులేనన్నారు. పేరుకే ఇది ప్రభుత్వముందన్నారు. రైతు ప్రభుత్వమని చెబుతున్న ఈ ప్రభుత్వంలో రైతులు రోడ్డు మీదకు ఎక్కుతున్నారన్నారు. ప్రజల కోసం ఆలోచించినన్ని రోజులు జగన్ కు మద్దతుగా ఉంటానన్నారు.












Click it and Unblock the Notifications