మూడేళ్లు కాదు ప్రభుత్వానికి ముందే మూడుతుంది: వైయస్ జగన్

YS Jagan
విజయవాడ: రైతుల సమస్యల విషయంలో నేటి ప్రభుత్వం, నాటి చంద్రబాబునాయుడు ఇద్దరూ ఒకటేనని మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తన లక్ష్యదీక్ష ముగింపు సభలో అన్నారు. రైతలను విస్మరిస్తే ప్రభుత్వానికి మూడేళ్లు కాదని అంతలేపే డిపాజిట్లు కూడా రావన్నారు. చరణ్ సింగ్ పుట్టిన రోజు సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ రోజును రైతు దినంగా ప్రకటించింది. కానీ రైతు సోదరులు సామూహిక నిరాహార దీక్ష చేస్తుంటే కనిపించటం లేదన్నారు. 48 గంటలుగా రైతు సమస్యలపై నిరాహార దీక్ష చేస్తూ ఆవేదన వ్యక్తపరిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించడం లేదన్నారు.

రైతులు సాయం కోసం ఆకాశం వైపు చూస్తున్నారన్నారు. పదిహేను రోజులుగా వందకుపైగా రైతులు చనిపోయారన్నారు. ముఖ్యమంత్రి సాయం ప్రకటించిన తర్వాతే 84 మంది రైతులు చనిపోతే ఇప్పటికైనా ప్రభుత్వానికి సిగ్గు రావటం లేదా అన్నారు. లక్ష్యదీక్ష ముగింపు రోజున తెలుగుదేశం పార్టీ దీనిని అడ్డుకోవడానికి రోడ్డు దిగ్బంధం అంటూ కార్యక్రమం పెట్టుకున్నారన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రైతులను నిర్లక్ష్యం చేశారన్నారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు ఇప్పుడు రైతుల కోసం దీక్ష అనటం సరికాదన్నారు. ఉచిత విద్యుత్ ఇవ్వాలని అడిగితే తీగలపై బట్టలు ఆరేసుకోవడానికే పనికి వస్తాయన్నారు.

ఏడు రోజులుగా దీక్ష చేస్తున్నా చంద్రబాబు ఆరోగ్యం బాగానే ఉందన్నారు. చంద్రబాబుతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కుమ్మక్కయ్యారన్నారు. ఆ రోజు చంద్రబాబు ప్రభుత్వం, ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటే అన్నారు. రైతు సోదరులు, చేనేత కార్మికులు, మహిళను ఆదుకున్నది వైయస్ ఒక్కరే అన్నారు. ప్రభుత్వాన్ని ఏమీ ఎక్కవగా అడగటం లేదన్నారు. వైయస్ బతికి ఉంటే ఏ రైతు సోదరుడు, ఏ చేనేత కార్మికుడు నడిరోడ్డుపైకి ఎక్కవలసిన అనసరం రాకుండేది అన్నారు. వైయస్ స్పూర్తి నేటి ప్రభుత్వానికి ఎక్కడ ఉందని ప్రశ్నించారు. ప్రభుత్వానికి పోయేకాలం వచ్చింది కాబట్టే రైతులను పట్టించుకోవటం లేదా అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వంగా మారింది అని చెప్పడానికి నేను సిగ్గుపడుతున్నానన్నారు. ప్రభుత్వానికి పోయే కాలం వచ్చిందన్నారు. రైతు పక్షాన నిలబడే ఇలాంటి ఉద్యమాలు ఇంకా ఉధృతం చేస్తమన్నారు. ఈ ప్రభుత్వానికి మూడేళ్లు కాదు, మూడేళ్లలోపు కూడా డిపాజిట్లు కూడా రావు. ఇఫ్పటికైనా ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడాలన్నారు. కాగా రైతు ఇచ్చిన నిమ్మరసంతో జగన్ దీక్ష విరమించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+