ప్రతిపక్షాల వల్లే పార్లమెంటు సమావేశాలు స్తంభించాయి: ప్రణబ్ ముఖర్జీ

Pranab Mukherjee
న్యూఢిల్లీ: ప్రతి పక్షాల వైఖరి కారణంగానే పార్లమెంటు శీతాకాల సమావేశాలు పూర్తిగా స్తంభించిపోయాయని కేంద్ర ఆర్థికశాఖ మాత్యులు ప్రణబ్ ముఖర్జీ గురువారం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో ఆరోపించారు. ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీతో సహా అన్ని విపక్షాలు 2 జి స్పెక్ర్టంపై అనవసర వివాదాన్ని పార్లమెంటులో సృష్టించాయన్నారు. వారికి ప్రజా సమస్యలపై ఏ మాత్రం పట్టింపు లేదన్నారు. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ నియమించేందుకు అవసరమైతే ప్రత్యేక చర్చకు తాము సిద్ధమని స్పష్టం చేశారు.

2జి స్పక్ట్రం విషయంపై పార్లమెంటులో కాకుండా ప్రత్యేక సమావేశం నిర్వహించి చర్చించాల్సిన ఆవక్యకత ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజా సమస్యలు చర్చించాల్సిన సమయంలో అనవసరంగా వేరేవాటిపై చర్చలు జరిపి ప్రజా ధనం నిరుపయోగం చేయకూడదన్నారు. ప్రజా సమస్యలు చర్చకు రాకుండా సమావేశాలను స్తంభింపజేసిన విపక్షాలు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సమావేశాలు సజావుగా సాగడానికి శక్తివంచన లేకుండా కృషి చేసిందని చెప్పుకొచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+