అఖిల పక్షంలో చరిత్ర తెలుసుకోవడానికి రాలేదు: సిఎంపై యనమల ఫైర్

Yanamala Ramakrishnudu
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు సమస్యలపై, చంద్రబాబునాయుడు నిరవధిక నిరాహార దీక్షపై ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం చర్చలు విఫలమయ్యాయి. ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ తెలుగుదేశం, సిపిఎం, సిపఐ పార్టీలు వాకౌట్ చేశాయి. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం ప్రకటించిన సాయంపై వారు పునరాలోచించుకోమని ఖచ్చితంగా చెబుతున్నారన్నారు. చంద్రబాబు దీక్ష, రైతులకు సంబంధించిన డిమాండ్లను ప్రభుత్వం ముందు మళ్లీ స్పష్టం చేసినప్పటికీ ప్రభుత్వం చేతులెత్తేసిందన్నారు. తాము చరిత్ర గురించి తెలుసుకోవాడనికి వచ్చినట్టు కొందరు మంత్రులు మాట్లాడుతున్నారన్నారు. కేంద్రం ప్రకటించిన 600 కోట్ల రూపాయలు గ్రాంట్ కాదని, అది అడ్వాన్సు మాత్రమే అన్నారు.

తడిసిన ధాన్యాన్ని కొనలేమని ప్రభుత్వం అంటుందన్నారు. ప్రకృతి విపత్తులు ఏర్పడితే తక్షణ సాయం గురించి ముఖ్యమంత్రి ప్రస్తావించటం లేదన్నారు. రాష్ట్రం, కేంద్రం ప్రకటించిన సాయం ఏ మాత్రం సంతృప్తికరంగా లేదన్నారు. ఓ ప్రతిపక్ష నేత నిరాహార దీక్ష చేస్తుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి సరిగా లేదన్నారు. ముఖ్యమంత్రి అఖిల పక్షం పేరుతో చర్చకు పిలిచి నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. మాట్లాడితే కేంద్రానికి లేఖలు రాశామని చెప్పటం సమంజసం కాదన్నారు.

ప్రభుత్వం చెప్పే లెక్కలు వాస్తవ విరుద్దంగా ఉన్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు అన్నారు. ముఖ్యమంత్రికి అనుభవం లేకుంటే అనుభవం ఉన్న మంత్రులు ఏం చేస్తున్నారన్నారు. వారు కూడా సమస్యలపై సరిగా స్పందించటం లేదన్నారు. సమస్యలను పక్క దారి పట్టించేందుకు ప్రభుత్వం వ్యవహరిస్తోందని సిపిఐ పార్టీ అధ్యక్షుడు నారాయణ అన్నారు. కేరళ, తమిళనాడు తరహా సాయానికి ఆయన ఒప్పుకోవడం లేదన్నారు. మంత్రి ధర్మాన మాకు అంతర్జాతీయ రాజకీయాలు చెబుతున్నారన్నారు. అసలు సమస్యలను పక్కదారి పట్టించడానికి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. పరిహారం విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీరు బాగా లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+