చంద్రబాబుతో ముఖ్యమంత్రి కిరణ్ కుమ్మక్కు: కొండా సురేఖ

ప్రభుత్వాన్ని పడగొట్టే ఆలోచన జగన్ కు లేదని చెప్పారు. జగన్ విషయాన్ని డైవర్ట్ చేయడానికి చాలామంది కుట్రలు పన్నుతున్నారన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జగన్ దీక్షకు మద్దతు ప్రకటించాల్సింది పోయి తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కయ్యారన్నారు. జగన్ దీక్షకు కూర్చున్నప్పుడే తెలుగుదేశం పార్టీ 48 గంటల బంద్ కు పిలుపునిచ్చిందన్నారు. జగన్ దీక్షను దెబ్బతీయడానికి ఈ రోజు రోడ్ల నిర్భంధాన్ని తెలుగుదేశం ప్రభుత్వం చేపడుతుందన్నారు.
తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో రైతులకు ఏమీ చేయలేదన్నారు. డబ్బుకోసం రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, వ్యవసాయం దండగ అన్న వారు ఇప్పుడు దీక్ష చేయడం సిగ్గు చేటు అన్నారు. చంకలో బిడ్డను పెట్టుకొని ఊరంతా వెతికిన చందంగా చంద్రబాబు తీరు ఉందన్నారు. జగన్ దీక్షకు నిబద్దత ఉందన్నారు. రైతుల సమస్యలు తీర్చాలంటే వ్యవసాయం తెలవాల్సిన అవసరం లేదన్నారు. ఓ రాజకీయ నాయకుడు సభ ఏర్పాటు చేస్తే అందరూ రైతులు, చేనేత కార్మికులే రారని చెప్పారు.












Click it and Unblock the Notifications