వైయస్ జగన్‌ పై వైయస్సార్ శిష్యుడు రఘువీరా రెడ్డి ధ్వజం

Raghuveera Reddy
హైదరాబాద్ : మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్‌ను విమర్సిస్తూ తొలిసారి మంత్రి ఎన్. రఘువీరా రెడ్డి మాట్లాడారు. కాంగ్రెసు పార్టీ మూడో స్థానానికి దిగజారుతుందని వైయస్ జగన్ చేసిన ప్రకటనను ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యతిరేకించారు. రఘువీరా రెడ్డి దివంగత నేత వైయస్సార్ ప్రియ శిష్యుడు కావడం విశేషం. జగన్ కాంగ్రెసులోనే కొనసాగాలని తాము కోరుకున్నామని, కాంగ్రెసు తరఫున జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని తాము అనుకున్నామని, ఇప్పుడు జగన్ వేరే పార్టీ పెడతానని అంటున్నారని ఆయన అన్నారు. తాము వైయస్సార్ అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ముందుకు తీసుకు పోతున్నామని, అందులో ఏవైనా లోపాలు ఉంటే సూచనలు చేయవచ్చునని, కానీ కాంగ్రెసు పార్టీ మూడో స్థానానికి దిగజారుతుందని అనడం సరి కాదు.

సూచనలు చేస్తే తాము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని, తమ ప్రభుత్వం బేషిజాలకు వెళ్లదని ఆయన అన్నారు. ఇంకా మూడు, మూడున్నరేళ్లు ఈ ప్రభుత్వం కొసాగుతుందని వైయస్ జగన్ కూడా అంటున్నారని, అందువల్ల ఏయే పార్టీ ఏయే స్థానంలో ఉంటుందని మాట్లాడే సమయం ఇది కాదని, ఎన్నికలు వచ్చినప్పుడు ఆ విషయం ప్రస్తావనకు వస్తుందని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీ ఎందుకు మూడో స్థానానికి వెళ్తుంది, ఎందుకు వెళ్లాలని ఆయన అడిగారు. వైయస్సార్ కాంగ్రెసు ప్రతినిధిగా కార్యక్రమాలు చేశారని, తాము వైయస్సార్ వారసులమని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ మొదలుకుని కాంగ్రెసు కార్యకర్తలంతా వైయస్‌ను అభిమానించేవాళ్లని ఆయన అన్నారు. కాంగ్రెసు మూడో స్థానానికి పడిపోతుందని వైయస్ జగన్ చేసిన ప్రకటన పేదవాడి మనసును నొప్పిస్తుందని, పేదవాడు అభద్రతా భావానికి గురవుతాడని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+