చంద్రబాబుకు మరో తెలంగాణ షాక్: తెరాసలోకి ముగ్గురు ఎమ్మెల్యేలు

మరో ఇద్దరు శాసనసభ్యులు సుద్దాల దేవయ్య, వేణుగోపాలాచారి కూడా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి తెరాసలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. పోచారం శ్రీనివాస రెడ్డిని బుజ్జగించడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు రంగంలోకి దిగారు. పార్టీ సీనియర్ నేత టి. దేవేందర్ గౌడ్ ఆదివారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. పోచారం శ్రీనివాస రెడ్డికి నచ్చజెప్పడానికే ఆయన జిల్లాలో పర్యటించినట్లు చెబుతున్నారు. అయితే, దేవేందర్ బుజ్జగింపులు పనిచేయలేదని తెలుస్తోంది. దీంతో సోమవారం మరో సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి రంగంలోకి దిగారు. పోచారం శ్రీనివాస రెడ్డిని నివారించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయినా పోచారం శ్రీనివాస రెడ్డి వినడం లేదని తెలుస్తోంది.
ఈ ముగ్గురు శాసనసభ్యులే కాకుండా మరో పది మంది దాకా ఇదే బాట పట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణపై చంద్రబాబు వైఖరికి నిరసనగా, కాంగ్రెసు నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా వారు శాసనసభా సభ్యత్వాలకు కూడా రాజీనామాలు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. తమ తమ నియోజకవర్గాల్లో పార్టీ క్యాడర్ మొత్తం తెరాసలోకి మళ్లిన నేపథ్యంలో, గత ఉప ఎన్నికల్లో తమ పార్టీకి వందల ఓట్లు కూడా పోల్ కాని స్థితిలో వారు పార్టీ నుంచి తప్పుకోవడమే మంచిదనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications