పార్టీ మార్పుపై మనసు మార్చుకున్న ఎమ్మెల్యేలు సుద్దాల, షిండే

తెలుగుదేశం పార్టీలో ఉండి తెలంగాణ సాధన కోసం పోరాడాలని కార్యకర్తలు సమావేశంలో సూచించినట్టు సుద్దాల దేవయ్య చెప్పారు. మెజారిటీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గారని చెప్పారు. కార్యకర్తల మనోభావాల మేరకే తాను టిడిపిలో కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. కార్యకర్తల మనోభావాలను చంద్రబాబు దృష్టికి తీసుకు వెళతానన్నారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి పార్టీకి రాజీనామా చేశారని మరో శాసనసభ్యుడు హనుమంతు షిండే అన్నారు. తెలంగాణ కోసం మా పోరాటం సాగుతుందన్నారు. తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ఢోకా లేదన్నారు. తాను పార్టీ మారుతుందనే వార్తలో నిజం లేదన్నారు. తనకు అసలు అలాంటి ఉద్దేశ్యమే లేదని చెప్పారు.












Click it and Unblock the Notifications