మద్దెలచెర్వు సూరి హత్యలో మరో మలుపు: కొత్తగా తెరపైకి గణేశ్

భాను సూరిని హత్య చేసిన తర్వాత, హత్యకు ముందు ఎన్నో ఫోన్లు చేశారు. చాలామందికి ఫోన్లు చేసి మాట్లాడాడు. సూరి హత్య తర్వాత సూరి ఫినిష్ అనే మెసేజ్ కూడా ఎవరికో చేశాడు. అయితే భాను మాట్లాడిన ఫోన్లలో 9000571141 అనే ఫోన్ నంబరు కూడా ఉంది. ఆ నెంబరు శింగనమల గణేష్ పేరుతో అనంతపురం అడ్రస్ పై రిజిస్టర్ అయి ఉంది. దీంతో పోలీసులు ఆ కోణంలో దర్యాఫ్తు చేస్తున్నారు. గణేష్, భానుకు బంధువు. సూరి జైలులో ఉన్నప్పుడు గణేష్ బిర్యానీ ప్యాకెట్లలో సెల్‌ఫోన్‌లు అందించిన ఆరోపణలలో ఉన్నాడు. సూరికి గణేశ్‌కు మంచి సన్నిహితుడు. సూరి హత్యతో ఓ మంత్రి కుమారుడికి, విజయవాడకు చెందిన ఓ రాజకీయ నాయకుడి హస్తం ఉందని తెలిసిన పోలీసులు ఆ కోణంలో కూడా దర్యాఫ్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications