తుది నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమే: నాగం జనార్ధన్‌రెడ్డి

కమిటీని సూచించిన మిగిలిన వాటిని తాము పరిగణలోకి తీసుకోవటం లేదన్నారు. కమిటీ సభ్యులు వారి పరిధి దాటి సూచనలు చేశారన్నారు. ఇంత సమయాన్ని, ఇన్ని కోట్లు ఖర్చు చేసి ఇచ్చిన నివేదిక విలువలు లేని రిపోర్టుగా తయారయిందన్నారు. కమిటీ నివేదిక తెలంగాణ ప్రజల మనోభావాలను, తెలంగాణ ప్రజలను అవమానపరిచే విధంగా ఉన్నాయన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఫజల్ అలీ కమిటీ నివేదికకు పూర్తి భిన్నంగా ఉందన్నారు. తెలంగాణ ప్రజల వాదనలు నిజమని శ్రీకృష్ణ కమిటీ చెబుతూనే మళ్లీ ప్రత్యేక బోర్డులు అనటం ఏమిటని ప్రశ్నించారు. ప్రత్యేక బోర్డులు ఏవీ మాకు వద్దని, కేవలం ప్రత్యేక రాష్ట్రమే కావాలన్నారు.
చివరి నిర్ణయం కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాలని, అది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే కావాలని చెప్పారు. తెలంగాణకు అనుకూలంగా రానున్న పార్లమెంటు సమావేశాల్లో బిల్లు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో మోహరించిన పోలీసు బలగాలను కూడా వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకుంటే శాంతియుతంగా ఉద్యమాలు చేపడతామని, తమను పోలీసు బలగాలు ఏమీ చేయలేవన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఇక్కడి అన్ని పార్టీలు ఏకమై పోరాడాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications