రెండురోజులు తెలంగాణ బంద్, రేపు రాజ్ భవన్ ముట్టడి: ఓయు జెఏసి

నివేదిక తెలంగాణను అనుకూలంగా లేనందున శుక్రవారం, శనివారం తెలంగాణను బంద్ నిర్వహిస్తున్నామన్నారు. శుక్రవారం తెలంగాణలోని విద్యార్థులు పెద్ద ఎత్తున హైదరాబాదుకు తరలి రావాలని కోరారు. రేపు రాజ్ భవన్ ముట్టడిని నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. కాగా సిఫార్సులను తాము గుర్తించడం తెలంగాణ జెఏసి చెప్పింది. రాష్ట్రం ఏర్పాటు అయ్యే వరకు అలుపెరగకుండా పోరాడుతామని ప్రకటించింది. కాగా నివేదిక తెలంగాణకు అనుకూలంగా లేదంటూ వరంగల్ లోని డిసిసి ఆఫీసుపై కొందరు దాడి చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బస్సు అద్దాలు పగులగొట్టారు.












Click it and Unblock the Notifications