తామంతా రాజీనామాలకు కట్టుబడి ఉన్నాం: పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాము రాజీనామాలకు కట్టుబడి ఉన్నామని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో వెనక్కి తగ్గేది లేదని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికను తాము తిరస్కరిస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ సాధన కోసం జరిగే పోరాటంలో కేంద్ర మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి క్రియాశీలక పాత్ర పోషించాలని ఆయన కోరారు. తెలంగాణ సాధనలో విఫలమైతే చచ్చినా, బతికినా ఒక్కటేనని ఆయన అన్నారు.

2011లో ప్రజలకు తీపి కబురు అందుతుందని కాంగ్రెసు మరో తెలంగాణ పార్లమెంటు సభ్యుడు జి. వివేక్ అన్నారు. 2011లో తెలంగాణ రాష్ట్రం సాకారమవుతుందని ఆయన చెప్పారు. తెలంగాణ కోసం అధిష్టానంపై ఒత్తిడి తెస్తామని ఆయన చెప్పారు. సీమాంధ్ర నాయకులతో శ్రీకృష్ణ కమిటీ సభ్యులు జల్సా చేశారని ఆయన విమర్శించారు. తెలంగాణ కోసం ఏ పోరాటానికైనా సిద్ధమని పార్లమెంటు సభ్యుడు రాజయ్య అన్నారు.

తెలంగాణ డిమాండ్ బలంగా ఉందని చెప్పడానికి ఉప ఎన్నికల ఫలితాలే నిదర్శనమని ఆయన అన్నారు. తెలంగాణ కోసం అధిష్టానాన్ని ఒప్పిస్తామని ఆయన చెప్పారు. యుపిఎ నిర్ణయంపైనే రాష్ట్రంలో కాంగ్రెసు పరువు, ప్రతిష్ట ఆధారపడి ఉన్నాయని ఆయన అన్నారు. బలప్రయోగంతో తెలంగాణ ఉద్యమాన్ని అణచలేరని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+