పాత ప్రాంతీయ బోర్డు ప్రత్యామ్నాయం కొత్తగా ముందుకు

తెలంగాణ ప్రాంతీయ బోర్డును ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి చైర్మన్‌గా పునరుద్ధరించారు. రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతీయ బోర్డులు ఉనికిలోకే రాలేదు. అయితే, ప్రాంతీయ బోర్డుకు ఉన్న హక్కులను పూర్తిగా నీరు గార్చారు. మొదటిసారి ఏర్పడ్డ తర్వాత క్రమక్రమంగా ప్రాంతీయ బోర్డులను నిర్వీర్యం చేస్తూ వచ్చారు. పెద్ద మనుషుల ఒప్పందం, ఆరు సూత్రాల పథకం వంటివి అమలు కాలేదనే అభిప్రాయం తెలంగాణ ప్రజల్లో ఉందంటూనే పాత ప్రాంతీయ బోర్డునే శ్రీకృష్ణ కమిటీని ముందుకు తేవడం ఆశ్చర్యకరమే. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రాంతీయ బోర్డును పునరుద్ధరించినప్పుడే తెలంగాణవాదులు వ్యతిరేకించారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ నాటి నుంచి తెలంగాణ కోసం చట్టబద్దంగా, రాజ్యాంగ బద్ధంగా కల్పించిన రక్షణలేవీ అమలు కాలేదనేది నిజం. ఆ కారణంగానే తమకు ఈ ప్రత్యామ్నాయం ఆమోదయోగ్యమని ప్రజారాజ్యం పార్టీ నాయకుడు పి. రామచంద్రయ్య అంటున్నారు. ఆ కారణంగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాడు డిమాండ్ ఇప్పటికీ బలంగా ఉంది. అందువల్ల శ్రీకృష్ణ కమిటీ అత్యంత ముఖ్యమైందిగా భావించిన ఆరో ప్రత్యామ్నాయం తెలంగాణవారికి ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదనేది వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు.












Click it and Unblock the Notifications