ప్రజారాజ్యం ఎమ్మెల్యే అనీల్ కుమార్ కు కార్యకర్తలనుండి పరాభవం

ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు చిరంజీవి సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నామని చెబుతున్నప్పటికీ అనీల్ ప్రజారాజ్యంలో కొనసాగటం తెలంగాణవాదులకు తీవ్ర ఆగ్రహం కలిగిస్తోంది. గతంలో అనీల్ తెలంగాణ ప్రజారాజ్యం అన్నప్పటికీ ఆ తర్వాత పార్టీ నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. తెలంగాణకు కట్టుబడి ఉన్నానని, తెలంగాణ సాధనకు చిరంజీవితో విభేదించి తెలంగాణ ప్రజారాజ్యం అంటూ మరోవైపు పార్టీ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనటంపై తెలంగాణవాదులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కాగా ఇటీవలే తెలుగుదేశం పార్టీనుండి బయటకు వెళతానని ప్రకటించిన నిజామాబాద్ జిల్లా బాన్సువాడ శాసనసభ్యుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈ ఆందోళనలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications