ఉద్రిక్తతమవుతున్న తెలంగాణ: రాజకీయ నేతల ఇళ్లు ముట్టడి

నిజామాబాద్‌లో కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ ఇంటిని ఆందోళనకారులు ముట్టడించారు. రాజీనామా చేయాలని ఆయనను డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు రమేష్ రాథోడ్‌ను ఆందోళనకారులు అడ్డుకున్నారు. ఈ సమయంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రి సుదర్శన్ రెడ్డి రాజీనామా చేయాలని నిజామాబాద్ జిల్లాలో ర్యాలీలు నిర్వహించారు. మెదక్ జిల్లాలో మంత్రులు దామోదర రాజనర్సింహ, గీతారెడ్డి దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. వరంగల్ జిల్లా మహబూబాబాద్‌లో కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు బలరాం నాయక్ ఇంటిని ముట్టడించారు.
ఖమ్మం జిల్లాలో సింగరేణి కార్మికులు ర్యాలీ నిర్వహించారు. శ్రీకృష్ణ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. వరంగల్లులో విద్యాసంస్థలు, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. వరంగల్లులో కోర్టులకు తాళాలు వేశారు. ఎంజిఎం ఆసుపత్రి ముందు నర్సులు ఆందోళనకు దిగారు. అన్ని జిల్లాల్లోనూ ర్యాలీలు, ప్రదర్శనలు జరుగుతున్నాయి. విద్యాసంస్థలను మూసేశారు.












Click it and Unblock the Notifications