న్యాయమైన పోరాటం చేస్తున్న జగన్ ‌కు నా మద్దతు: జయసుధ

Jayasudha
న్యుఢిల్లీ: కృష్ణా నీటి కోసం న్యాయమైన పోరాటం చేస్తున్న మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్‌రెడ్డికి తన మద్దతు ఉంటుందని సినీ నటి, సికిందరాబాద్ శాసనసభ్యురాలు జయసుధ మంగళవారం అన్నారు. జగన్ దీక్ష పార్టీలకు అతీతంగా చేస్తున్నదని చెప్పారు. దీనిపై అనవసర కాంట్రవర్సీలు వద్దని సూచించారు. అన్యాయం జరిగినప్పుడు స్పందించాల్సిన ధర్మం ప్రజా ప్రతినిధులుగా మాపై ఉందని మాజీ మంత్రి, పరకాల శాసనసభ్యురాలు కొండా సురేఖ అన్నారు. జగన్ న్యాయం కోసం పోరాడుతున్నారు కాబట్టే శాసనసభ్యులు తమ మద్దతు ప్రకటిస్తున్నారన్నారు.

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు చెందిన రైతులకు న్యాయం జరగాలని జగన్ దీక్ష చేస్తున్నారని ప్రజారాజ్యా పార్టీ శాసనసభ్యురాలు శోభానాగిరెడ్డి అన్నారు. పార్టీలకతీతంగా రైతులకోసం చేస్తున్న దీక్ష కాబట్టి మేం మద్దతు పలుకుతున్నామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి మేం పోరాటం చేస్తామన్నరు. పార్టీలకతీతంగా అందరూ పాల్గొన్నారన్నారు. రాష్ట్రమంతా ఇప్పుడు జగన్‌ను కలవరిస్తోందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+