మొయిలీపై నింద వేసిన వైయస్ జగన్, రాష్ట్రానికి తీరని అన్యాయం

కృష్ణానది జలాల వివాదం అంతర్రాష్ట్ర వివాదమని, అందువల్ల కేంద్రం జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. వరదలు వచ్చినప్పుడు దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్ నష్టపోతోందని, అందువల్ల మిగులు జలాలపై హక్కు ఆంధ్రప్రదేశ్‌కు ఉండాలని బచావత్ చెప్పారని, ఆ మిగులు జలాలను బ్రజేష్ కుమార్ పంచారని ఆయన అన్నారు. కర్ణాటకకు అనుకూలంగా బ్రజేష్ కుమార్ తీర్పు ఉందని ఆయన విమర్శించారు. తనపై చాలా మంది విమర్శలు చేస్తూ ఉండవచ్చునని, అయితే తాను ఎవరినీ వేలెత్తి చూపదలుచుకోలేదని, తనకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని ఆయన అన్నారు. సమస్య పరిష్కారానికి ప్రధాని జోక్యం చేసుకోవాలని తాము కోరుతున్నామని, అందుకే తాను దీక్ష చేస్తున్నానని, ఇందులో మరో ఉద్దేశం లేదని ఆయన అన్నారు.
పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి గోదావరి నదీ జలాలను కృష్ణా నదికి తరలిస్తే తప్ప రాష్టానికి మేలు జరగదని, ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఈ విషయంలో ఒకే కాంగ్రెసు పార్టీలు రెండు అభిప్రాయాలున్నాయని, కాంగ్రెసు నాయకత్వం తమ పార్టీ పార్లమెంటు సభ్యులకు ఎందుకు నచ్చజెప్పడం లేదని ఆయన అన్నారు. పోలవరంతో పాటు గోదావరి నదిపై ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టును కూడా నిర్మిస్తామని కాంగ్రెసు నాయకత్వం తన పార్టీ ఎంపీలకు ఎందుకు చెప్పడం లేదని ఆయన ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications