బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వర్సెస్ మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్

మక్కా మసీదు పేలుళ్లలో విశ్వహిందూ పరిషత్ హస్తం ఉందని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై కిషన్‌రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. మజ్లిస్ పార్టీ వల్లే హైదరాబాదు తీవ్రవాదులకు అడ్డాగా మారిందని ధ్వజమెత్తారు. అమాయక ముస్లిం యువకులను రెచ్చగొట్టి మజ్లిస్ పార్టీ తమ రాజకీయ పబ్బం గడుపుకుంటుందని తీవ్రంగా విమర్శించారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం కిషన్‌రెడ్డి అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై తీవ్రంగా మండి పడ్డారు. తెలంగాణ విద్యార్థుల కేసులు అన్నింటిని ఎత్తివేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి డిమాండ్ చేసిన నేపథ్యంలో అక్బరుద్దీన్ ముస్లిం యువకులపై పెట్టిన టెర్రరిస్టు కేసులు కూడా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అయితే ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమానికి, టెర్రరిజానికి ముడి పెట్టకూడదని సూచించారు.
మక్కా మసీదు పేలుళ్లలో హిందూ సంస్థల హస్తం ఉందని అక్బరుద్దీన్ అసెంబ్లీలో అన్నారు. ఆ సమయంలో అసెంబ్లీ నుండి వాకౌట్ చేసిన కిషన్‌రెడ్డి లంచ్ అవర్ తర్వాత తిరిగి వచ్చి అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై స్పందించారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. మక్కా మసీదు పేలుళ్లలో హిందువులకు పాత్ర ఉన్నా, ముస్లింలకు పాత్ర ఉన్నా శిక్షించాల్సిందేనని డిమాండ్ చేశారు. తాము టెర్రరిజానికి మాత్రమే వ్యతిరేకమని చెప్పారు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications