పాకిస్తాన్‌ లో భారీ భూకంపం, ఉత్తర భారతదేశంలో ప్రకంపనలు

New Delhi
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌ను భారీ భూకంపం కుదిపేసింది. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారు జామున రెండు గంటలకు ఈ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్‌పై ఇది 7.4గా నమోదైంది. ఢిల్లీ, రాజస్థాన్, హర్యానా వంటి ఉత్తర భారతదేశ ప్రాంతాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. గోడ కూలడంతో పాకిస్తాన్‌లో ఓ వ్యక్తి మరణించినట్లు తెలుస్తోంది. భారతదేశంలో మాత్రం ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టాలు జరగలేదని తెలుస్తోంది.

ప్రకంపనలు రావడంతో ఢిల్లీ ప్రజలు ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. గది కదిలిపోతున్నట్లు అనిపించిందని, దాంతో భయంతో బయటకు పరుగులు తీశామని ఢిల్లీ ప్రజలు చెబుతున్నారు. ఇరాన్, అఫ్గనిస్తాన్ సరిహద్దుల్లోని పాకిస్తాన్ భూభాగంలో భూకంపం వచ్చినట్లు భారత భూభౌతిక శాస్త్రవేత్తలు చెప్పారు. భూకంపం వచ్చిన ప్రాంతం మారుమూలలో ఉండడంతో నష్టం గురించి తెలియడం లేదు. నష్టం తీవ్రంగానే ఉంటుందని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+