రణభూమిగా జమ్మూ-పంజాబ్ సరిహద్దు: కదులుతున్న బిజెపి కార్యకర్తలు

పోలీసులు పంజాబ్-జమ్మూ సరిహద్దుల్లో అడ్డుకుంటున్నప్పటికీ కార్యకర్తలు వారిని తోసుకుని ముందుకు వెళ్లారు. ఈ తిరంగా యాత్రలో సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ పాల్గొన్నారు. తిరంగా యాత్ర జమ్మూ చేరుకున్నాక పోలీసులు అడ్డుకోవడాన్ని దేశంలో కూడా తీవ్రంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అన్ని రాష్ట్రాలనుండి కార్యకర్తలు వెళుతున్నప్పటికీ అడ్డకోవడాన్ని వ్యతిరేకించాయి. జమ్మూ వెళ్లిన లక్షలాది మంది కార్యకర్తలతో త్రివర్ణ పతాకాలతో నిండిపోయింది. భారతదేశంలో అంతర్భాగమైన శ్రీనగర్‌లో జాతీయ జెండా ఎగురవేయడానికి అడ్డు చెప్పడం తీవ్రవాదులకు ఊతమివ్వడమేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, జమ్మూలో ఓమర్ ప్రభుత్వం తీవ్రవాదులకు అండగా నిలుస్తున్నాయని విమర్శించారు. జనవరి 26వ తారీఖున శ్రీనగర్‌లో తప్పకుండా జాతీయ జెండా ఎగురవేస్తామని చెప్పారు. భారత్‌లో పాకిస్తాన్ జెండా ఎగురవేస్తే పట్టించుకోని ప్రభుత్వం మన జాతీయ జెండాను ఎగురవేస్తే అడ్డుకోవడాన్ని ప్రజల హర్షించరన్నారు.












Click it and Unblock the Notifications