జగన్‌పై సిఎం కిరణ్ కుమార్ తొందరపడ్డారు: ఆదినారాయణ రెడ్డి

కూల్చే ఉద్దేశ్యం ఉంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన రచ్చబండలో పాల్గొనే వారం కాదని చెప్పారు. రచ్చబండ పేరుమార్చి అంకితంగా మార్చాలని సూచించారు. ముఖ్యమంత్రి చెప్తే తాము రాజీనామాలు చేయబోమని, వైయస్ జగన్ చెప్తే రాజీనామా చేస్తామని ఆయన అన్నారు. మంగళవారం రచ్చబండ కార్యక్రమంలో ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు.
కాగా కృష్ణా జిల్లాలో మంత్రి పార్థసారధి పాల్గొన్న రచ్చబండలో కాస్త ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రి కృష్ణా జిల్లాలోని ఉయ్యూరు మండలం పెద్ద ఓగిరాల రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే సిఎం వ్యాఖ్యలను నిరసనగా జగన్ వర్గం కార్యకర్తలు మంత్రిని అడ్డుకున్నారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications