కాంగ్రెస్ అవినీతిపై చంద్రబాబు పోరాటం: జాతీయస్థాయిలో ఆందోళనలు

అఖిలపక్షం భేటీ అనంతరం చంద్రబాబు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ధరలను వంద రోజుల్లో తగ్గిస్తానని చెప్పి ఇప్పటికీ తగ్గించలేదని ఆరోపించారు. కాంగ్రెస్ హయంలో ధరలు రోజురోజుకు ఆకాశాన్నంటుతున్నాయన్నారు. సామాన్యులు తినే పరిస్థితి లేకుండా ఉందన్నారు. ప్రభుత్వం ధరలు ఇప్పటి వరకు ఎందుకు తగ్గించలేదని చంద్రబాబు ప్రశ్నించారు. కేంద్ర విధానాలు సంపన్నులకే తప్ప సామాన్యులకు ఎలాంటి దోహదం చేయవన్నారు. కానీ ప్రభుత్వంలో ఉన్న వారు మాత్రం లక్షల కోట్ల రూపాయల ప్రజల ఆస్తిని దోచేస్తున్నారన్నారు. ధరలు అదుపు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని సిపిఎం కార్యదర్శి రాఘవులు అన్నారు.












Click it and Unblock the Notifications