మహబూబ్‌నగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంత్రి డికె అరుణ హత్యకు కుట్ర, బెదిరింపు కాల్స్: తప్పిన ప్రాణాపాయం!

By Srinivas
|
Google Oneindia TeluguNews

మహబూబ్‌నగర్: సమాచార శాఖమంత్రికి ప్రాణాపాయం తప్పింది. కొందరు దుండగులు మంత్రి డికె అరుణ హత్యకు కుట్ర చేసినట్టుగా తెలుస్తోంది. అయితే పోలీసులు అప్రమత్తమై డిటోనేటర్లను తొలగించారు. దీంతో మంత్రికి ప్రాణపాయం తప్పింది. శనివారం సాయంత్రం ఓ అగంతకుడు డికె అరుణకు ఫోన్ చేసి ఐజ దగ్గర మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారని చెప్పారు. దాంతో మంత్రి అరుణ దగ్గరలోని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఆ అగంతకుడు శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో అరుణకు ఫోన్ చేశారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెద్దకొత్తపల్లి గ్రామంలోని కాయిన్ బాక్సునుండి వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు.

అయితే ఐజ దగ్గర పోలీసులు గాలించడంతో కొన్ని డిటోనేటర్లు దొరికాయి. రాత్రి సమయంలో పేలుడు పదార్థాలు దొరికాయి. ఫోన్ చేసిన వ్యక్తి గురించి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టినట్టు జిల్లా ఎస్పీ చెప్పారు. అయితే పేలుడు పదార్థాలు అమర్చినప్పటికీ అవి ప్రమాదకరమైనవి కావని ఎస్పీ చెప్పారు. విచారణ ప్రారంభించామన్నారు. కాగా రచ్చబండ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నందుకే మంత్రిని టార్గెట్ చేసుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఆమెకు ఫోన్ చేసిన అగంతకుడు రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనవద్దని కూడా హెచ్చరించాడు.

రచ్చబండలో పాల్గొంటే చంపివేస్తామని హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. డికె అరుణ వెళ్లే దారిలో ఆరు డిటోనేటర్లను దుండగులు అమర్చిపెట్టారు. బెదిరింపు చర్యలకు పాల్పడితే రచ్చబండలో పాల్గొనకుండా భయపడుతుందని దుండగులు భావించినట్లుగా తెలుస్తోంది.డిటోనేటర్లు ఖాళీగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఈ కారణంగా మంత్రిని బెదిరించడానికే గానీ చంపడానికి కాదన్న ఆలోచనతో కూడా దుండగులు అమర్చినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. వాటినీ లోతులో పెట్టక పోవడం కూడా గమనార్హం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X