జగన్‌కు చెక్ కాదు: చిరంజీవితో పొత్తుపై మంత్రి మాణిక్యవర ప్రసాద్

ప్రజారాజ్యం పార్టీతో కాంగ్రెసు పొత్తుపై ఇంకా నిర్ణయం జరగలేదని మరో మంత్రి దానం నాగేందర్ చెప్పారు. ప్రభుత్వం సంక్షోభంలో పడితే మద్దతిస్తామని చెప్పిన ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి ప్రకటనను తాము స్వాగతిస్తున్నామని ఆయన మంగళవారం విడిగా మీడియా ప్రతినిధులతో అన్నారు. నాలుగు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయని ఆయన చెప్పారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసులో విలీనమవుతుందా, కాంగ్రెసుతో పొత్తు పెట్టుకుంటుందా అనే విషయాన్ని తమ పార్టీ అధిష్టానం చూసుకుంటుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications