మక్కా పేలుళ్లలో హిందూ టెర్రరిజం హస్తం: సిఎం కిరణ్ వివాదాస్పద వ్యాఖ్య

Kiran Kumar Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి బుధవారం సున్నిత ప్రాంతమైన పాతబస్తీలో హిందూ తీవ్రవాదం అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాతబస్తీలో రచ్చబండ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఉదయం పాల్గొన్నారు. మక్కా పేలుళ్లలో హిందూ తీవ్రవాదుల హస్తం ఉందని వ్యాఖ్యానించారు. పాతబస్తీలో వెల్లువిరుస్తున్న మతసామరస్యాన్ని దెబ్బతీయడానికే హిందూ తీవ్రవాదులు మక్కా పేలుళ్లకు పాల్పడ్డారన్నారు. ఆ పేలుళ్లను మొదట ముస్లింలు చేశారని అందరూ భావించారన్నారు. కానీ సిబిఐ ఎంక్వయిరీలో హిందువులు చేసినట్టుగా తెలిసిందన్నారు. హైదరాబాదుకు మేలు చేయకుండా ఉండటానికి, రాష్ట్రంలో శాంతిభద్రతలను చెడగొట్టడానికే మక్కా పేలుళ్లకు పాల్పడ్డారన్నారు.

హిందుత్వ భావాలున్న వారిని దూరంగా పెట్టాలన్నారు. అయితే సిబిఐ ఎంక్వయిరీ వలన నిందితులు ఎవరో తేలిసి వారని జైల్లో పెట్టామన్నారు. మక్కా పేలుళ్లలో ఆరోపణలు ఎదుర్కొని కేసులో ఉన్న అమాయక ముస్లిం యువకులను అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. పాతబస్తీపై సిఎం వరాల జల్లు కురిపించారు. యూనానీ హాస్పిటల్‌కు రూ. 3.5 కోట్లు, కుడాకు 20 కోట్లు, హజ్‌హౌస్‌కు 30 ఎకరాల భూమిని, ముస్లిం యువతకు నాక్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. అయితే ముఖ్యమంత్రి తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికే ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని పలువురు భావిస్తున్నారు. ఒక వర్గం ఎక్కువగా ఉన్న ప్రాంతం, చాలా సున్నితమైన ప్రాంతంలోకి వెళ్లి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయటంపై పలువురు వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+