దిగిపోతా కానీ అల్లర్లు మరింత పెరుగుతాయమో: హోస్నీ ముబారక్

తహ్రీర్ స్క్వైర్ వద్ద జరిగిన హింసాత్మక సంఘటనలతో తనకు ఇబ్బంది కలుగుతోందని, అయితే దానికి తాను బాధ్యుడిని కాదని ఆయన అన్నారు. ఈజిప్టువారు పరస్పరం కలహించుకోవడం తనకు ఇష్టం లేదని ఆయన అన్నారు. తన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారనేది తాను పట్టించుకోదలుచుకోలేదని, ప్రస్తుతం తాను దేశాన్ని పట్టించుకుంటానని, ఈజిప్టు గురించి ఆలోచిస్తానని ఆయన అన్నారు. తన కుమారుడు గమాల్ తన వారసుడిగా రావాలని తాను ఏ రోజూ కోరుకోలేదని ఆయన అన్నారు. తాను పారిపోదలుచుకోలేదని, ఈ మట్టి మీదే మరణిస్తానని ఆయన అన్నారు.
మరోవైపు ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాన్ని పత్రికలకెక్కకుండా నిరోధించేందుకు విదేశీ, ఈజిప్టు పాత్రికేయులపై జరుగుతున్న దాడులను అమెరికా విదేశాంగ కార్యదర్శి హిల్లరీ క్లింటన్ ఖండించారు. పత్రికా స్వేచ్ఛను, అంతర్జాతీయ నియమాలను ఈ దాడులు ఉల్లంఘిస్తున్నాయని ఆమె అన్నారు. ఏ పరిస్థితుల్లోనూ ఈ దాడులు సమర్థనీయం కాదని చెప్పారు. ప్రభుత్వం, ప్రతిపక్షాలు, రాజకీయ పార్టీలు చర్చల ద్వారా శాంతియుత మార్పును తీసుకురావాలని ఆమె కోరారు.












Click it and Unblock the Notifications