మేడం సోనియా సమావేశం కోసం మెగాస్టార్ చిరు ఎదురుచూపులు

అయితే తీరా అక్కడకు వెళ్లిన తర్వాత చిరంజీవి భేటీని పలుమార్లు మారుస్తూ వచ్చారు. పీఆర్పీతో కాంగ్రెస్ పొత్తు అయినా, విలీనం అయినా ఏదైనా తమకు చిరు అంతగా అవసరం ఉందనుకున్నప్పుడు సోనియా చిరుకు చాలా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే రాష్ట్రంలో అత్యంత ప్రజాధరణ కలిగిన, కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉంటానని చెబుతున్న చిరుకు సోనియా అపాయింట్‌మెంట్ సమయం ఖచ్చితమైన సమయం చెప్పాల్సి ఉంటుంది. కానీ కాంగ్రెస్ దానిని పాటించలేదు. చిరుయే తమతో దోస్తీకి తహతహలాడుతున్నట్టు తమకు ఆయన అవసరం అంతగా లేనట్లుగా సోనియా వ్యవహార శైలి ఉందని పలువురు భావిస్తున్నారు. ఇలా చేయడం ఎపిలో అత్యంత ప్రజాధరణ కలిగిన చిరును అవమానించడమే అంటున్నారు.
అయితే కాంగ్రెస్ వ్యవహార శైలీ పొత్తుకు లేదా విలీనానికి ముందే ఇలా ఉంటే తర్వాత ఎలా ఉంటుందోనని యోచిస్తున్నారు. కాంగ్రెస్‌కు అవసరమైన దశలోనే చిరును ఢిల్లీకి పిలిపించుకొని ఉదయం భేటీ ఉంటుందని సాయంత్రం వరకు వెయిటింగ్ చేయించిన సోనియా పొత్తు తర్వాత చిరుకు ఏమాత్రం ప్రాధాన్యత ఇస్తుందనే భావనలో ఉన్నారు. ప్రస్తుతం ఆపద నుండి గట్టెక్కడానికి చిరును తన దరిన చేర్చుకొని ఆ తర్వాత ఇంకా రాజకీయాలు ఒంటబట్టని చిరుకు హ్యాండ్ ఇవ్వదనే గ్యారంటీ కూడా ఏమీ లేదని భావిస్తున్నారు.