AP Rain Alert: రేపు ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు..! ఐఎండీ అలర్ట్..!
ఏపీలో రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తున్నాయి. వీటి ప్రభావంతో పశ్చిమమధ్య బంగాళాఖాతం, దక్షిణ కోస్తాంధ్ర నుండి తమిళనాడు వరకు నైరుతి బంగాళాఖాతం మీదుగా విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రేపు కూడా పలు జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని (AP Rain Alert) విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ప్రకటించారు.
రేపు వర్షాలు కురిసే జిల్లాల్లో మన్యం, అల్లూరి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, నంద్యాల, తిరుపతి జిల్లాలు ఉన్నాయి. వీటిలో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని తెలిపారు. అలాగే శ్రీకాకుళం, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, గుంటూరు, బాపట్ల, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయన్నారు.

ఈదురుగాలులు, ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల క్రింద,భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడొద్దని అధికారులు సూచిస్తున్నారు. వర్షాలతో పొంగిపొర్లే వాగులు, కాలువలుతో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రకాశం బ్యారేజి వద్ద నీటిని దిగువకు విడుదల చేస్తున్నందున కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నదిలో పశువులను వదిలేయకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. వర్షపు గాలుల వల్ల ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపడి ఉంటే వాటిని గమనిస్తూ వీలైనంత దూరంగా ఉండాలన్నారు. ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే పొలాల్లో పనిచేసే రైతులు, పశుకాపరులు మరింత అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications