డెబ్బై ఏళ్ల కలకు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాణం పోశారు: వైఎస్ జగన్

ఈ సందర్భంగా ఆయన హాజరైన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కృష్ణా ట్రిబ్యునల్ తీర్పుతో రాష్ట్రం ఎడారిలా మారే అవకాశం ఉందన్నారు. రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. పోలవరం వల్ల రాష్ట్రం మొత్తానికి లాభం చేకూరుతుందన్నారు. నాడు అంబేడ్కర్, ఎన్జీ రంగా పోలవరం గురించి ఆలోచించారన్నారు. పోలవరం కోసమే తాను పాదయాత్ర చేస్తున్నానని చెప్పారు.
నాటినుండి నేటి వరకు డెబ్బై సంవత్సరాలుగా పోలవరం కలగా మిగిలి పోయిందన్నారు. దివంగత వైఎస్ కలలా మిగిలిపోయిన పోలవరం ప్రాజెక్టును ప్రారంభించేందుకు రాష్ట్రం నుండి నిధులు కేటాయించారన్నారు. అయితే కేంద్రం నుండి నిధులు మాత్రం ఇవ్వడం లేదన్నారు. పోలవరం కోసం నేను పాదయాత్ర చేస్తున్నానని ఇవ్వవద్దు అనుకుంటే తప్పు అన్నారు.
పోలవరం కోసం కేవలం నేను కాదు, లక్షల కాళ్లు తనతో ఉన్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పోలవరం నిర్మాణం కోసం ఆ భగవంతుడు మంచిబుద్ధిని ఇవ్వాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. పోలవరంతో పాటు, ప్రాణహిత-చేవెళ్ల, ఉత్తరాంధ్ర సుజలస్రవంతి తదితర ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయాలన్నారు. రాష్ట్ర బాగుకోసం దివంగత వైఎస్ ప్రారంభించిన పోలవరాన్ని వెంటనే ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. పోలవరం నిర్మించకపోతే రాష్ట్రం ఏడారిగా మారుతుందన్నారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications