నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బిఫారం తీసుకున్నప్పుడు గుర్తుకు రాలేదా: కొండా సురేఖకు ఆనం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Anam Ramnarayana Reddy
నెల్లూరు: మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్గం కాంగ్రెసు శాసనసభ్యురాలు కొండా సురేఖకు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ విదేశీయత ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి గురువారం ప్రశ్నించారు. కాంగ్రెసు పార్టీలో ఉన్నంత కాలం, ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి బి ఫారం తీసుకుంటున్న సమయంలో సోనియా విదేశీయత కనిపించలేదా అని ప్రశ్నించారు. రచ్చబండ కార్యక్రమం విజయవంతంగా జరుగుతుందని అన్నారు. కొన్ని చోట్ల మాత్రమే అడ్డంకులు ఎదురవుతున్నాయన్నారు. రచ్చబండ ద్వారా 1200 కోట్ల రూపాయల పథకాలు లబ్ధిదారులకు అందాయని చెప్పారు.

చిరంజీవికి అధిష్టానం ఏ పదవి ఇచ్చినా మేం కట్టుబడి ఉంటామని చెప్పారు. కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకుడు వెంకటస్వామికి వయసు మీద పడటంతో మతిభ్రమించి మాట్లాడుతున్నారు. కాకా తన కుమారుల రాజకీయ భవిష్యత్తు కోసమైనా ఇక విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.

English summary
Minister Aanam Ramanarayana Reddy questioned Ex MP YS Jagan camp MLA Konda Surekha on AICC president Sonia Gandhi issue today. He said, we would accept High Command decision on Chiranjeevi's post. Public is receiving very much Rachabanda programme, he said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X