చంద్రబాబును ఇరుకున పెట్టబోతున్న తెరాస అధినేత కెసిఆర్

తమపై విమర్శలు చేస్తున్న తెలుగుదేశం తెలంగాణ నాయకులపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. తమను కాంగ్రెసు బ్రాంచీగా తెలుగుదేశం నాయకులు అభివర్ణిస్తున్నారని, తెలుగుదేశం బ్రాంచీయో, తమ పార్టీ బ్రాంచీయో తేల్చుకోవడానికి తాము ప్రతిపాదించే అవిశ్వాస తీర్మానమే నిదర్శనమని ఆయన అన్నారు. తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకులు సొల్లు పురాణం చెబుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. శ్రీకృష్ణ కమిటీకి తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇప్పించలేని నాయకులు తమపై మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.
తెరాసను కలుపుకోవడానికి కాంగ్రెసు ప్రయత్నాలు సాగుతున్నాయని మీడియాలో వస్తున్న వార్తలపై కూడా ఆయన తీవ్రంగా మండిపడ్డారు. మీడియాలో వస్తున్నవి పిచ్చి పిచ్చి రాతలు, కారుకూతలు అని ఆయన వ్యాఖ్యానించారు. ఏకపక్షంగా మీడియాలో వార్తలు ఇస్తున్నారని, కనీసం తమ నుంచి వివరణ తీసుకోవాలనే విషయాన్ని కూడా పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications