కాలేజీలకు ఫీజులు చెల్లించండి: ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

వారం రోజుల్లో పూర్తిస్థాయి అఫిడవిట్ సమర్పించాలని ప్రభుత్వానికి సూచించింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను ఏమేరకు పాటించారో చెప్పాలని ఆదేశించింది. ఫీజుల విషయంలో కొన్ని అవకతవకలు జరిగాయని వాటిని సమీక్షుస్తున్నామని చెప్పిన ప్రభుత్వ వాదనను కోర్టు తప్పు పట్టింది. కాగా 9నెలలుగా ప్రభుత్వం పైసా కూడా చెల్లించలేదని ఇంజనీరింగ్ యాజమాన్యాలు చెబుతున్నాయి. 50 శాతం తక్షణమే చెల్లించాలని, మిగతా సగం ఏప్రిల్ మొదటి వారంలో చెల్లించాలని కోరారు. గత వారం ప్రభుత్వం, కళాశాల యాజమాన్యాలకు జరిగిన చర్చలు విఫలమవటంతో యాజమాన్యం సుప్రీంను ఆశ్రయించాయి.












Click it and Unblock the Notifications