జగన్ దీక్ష ఎఫెక్ట్!: ఫీజు రీయింబర్స్‌మెంట్స్ కోసం రూ.600 కోట్లు

ఇటీవల వరలక్ష్మి అనే విద్యార్థిని మరణించిన సమయంలో ఫీజు రీయింబర్స్‌మెంట్సుపై ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే ఈ నెల 18వ తేదిన ఒక్కరోజు దీక్షకు దిగుతానని జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే జగన్ ప్రకటించడంతో ప్రభుత్వంలో కదలిక వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సైతం ఫీజు రీయింబర్స్‌మెంట్స్‌పై విద్యార్థులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలకు ప్రభుత్వాన్ని అనే అవకాశం ఇవ్వవద్దనే ఉద్దేశ్యంతోనే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications