హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ పార్టీ నిలబడదు, ఉపపోరులో టిడిపి, కాంగ్రెసు మధ్యే పోటీ: డిఎల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

DL Ravindra Reddy
కడప\హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినా నిలబడదని వైద్య, ఆరోగ్య శాఖామంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి
మంగళవారం కడప జిల్లాలో విలేకరులతో చెప్పారు. కడప పార్లమెంటు, పులివెందుల అసెంబ్లీ ఉప ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ, తెలుగుదేశం మధ్యనే పోటీ ఉంటుందని స్పష్టం చేశారు. జగన్ పార్టీ కాంగ్రెసు‌కు పోటీ కాదని, అయినా ఆయన ఇంకా పార్టీయే పెట్టలేదని, పెట్టిన తర్వాత ఆలోచిద్దామన్నారు. జగన్ పార్టీ పెట్టినా అది నిలబడదన్నారు.

చిరంజీవి కాంగ్రెసు పార్టీకి విటమిన్‌లాంటి వారని చేనేత, జౌళీ శాఖమాత్యులు శంకర్‌రావు హైదరాబాద్‌లో అన్నారు. చిరంజీవి కాంగ్రెసు పార్టీలో చేరడం ద్వారా పార్టీ మరింత బలపడుతుందన్నారు. చేనేత, జౌళీ శాఖలో అన్ని నకిలీ సంఘాలు ఉన్నాయో తేల్చి చెప్పాలని విజిలెన్సు ఎన్‌ఫోర్సుమెంట్‌కు లేఖ రాశానని చెప్పారు. నకిలీలను గుర్తించి వాటిపై చర్యలు తీసుకుంటామన్నారు.

ఉద్యోగ సంఘాలు సహాయ నిరాకరణను విరమించుకోవాలని మంత్రి శ్రీధర్‌బాబు కోరారు. తెలంగాణ అంశం కేంద్రం పరిధిలో ఉందని, కేంద్రం నుండి సానుకూల నిర్ణయమే వెలువడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ప్రజా సమస్యలు చర్చించడానికి, పరిష్కరించడానికి ప్లాట్ ఫారం అని, ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గ ప్రజా సమస్యలను విన్నవించుకొని సమాధానాలు రాబట్టుకునే కేంద్రం కాబట్టి సమావేశాలను కూడా అడ్డుకునే యత్నం సరికాదన్నారు. ప్రజలకు మేలు చేసేందుకే బడ్జెట్ సెషన్సు అన్నారు. అవిశ్వాసం పెట్టే బలం టిఆర్ఎస్‌కు లేదని అన్నారు.

English summary
Minister DL Ravindra Reddy said that Ex MP YS Jaganmohan Reddy party will not survive long time. He said there is no Jagan's party issue in by election, the contest will be between TDP and Congress only. Chiranjeevi is vitamin for Congress another minister Shankar Rao said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X