అసెంబ్లీ పరిణామాలపై హైకమాండ్‌కు సిఎం కిరణ్ కుమార్ రెడ్డి వివరణ
State
oi-Pratapreddy
By Pratap
|
హైదరాబాద్: శాసనసభలో గురువారం జరిగిన పరిణామాలపై అన్ని పార్టీల్లో తీవ్ర కలకలం చెలరేగిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెసు అధిష్టానానికి ఫోన్ చేశారు. కేంద్రానికి, అధిష్టానానికి ఆయన అన్ని వివరాలను తెలియజేసినట్లు తెలుస్తోంది. లోకసత్తా అధ్యక్షుడు, శానససభ్యుడు జయప్రకాష్ నారాయణపై తెరాస శానసభ్యుల దాడిపై, గవర్నర్ ప్రసంగాన్ని తెలంగాణ శానససభ్యులు అడ్డుకోవడంపై ఆయన అధిష్టానానికి వివరించినట్లు సమాచారం.
కాగా, అసెంబ్లీ ఆవరణలో మీడియా పాయింట్ వద్ద జేపీ, పాలడుగుపై జరిగిన దాడిపై అసెంబ్లీ అధికారులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. తక్షణం కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని కోరారు. శాసనసభలో జరిగిన పరిణామాల నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులతో డిప్యుటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. డీజీపీ అరవిందరావు, ఇంటిలిజెన్స్ చీఫ్ మహేందర్‌రెడ్డి, పోలీస్‌కమిషనర్ ఏకే ఖాన్‌తో ఆయన భేటీ అయ్యారు.
పటిష్టమైన భద్రతాచర్యలను అసెంబ్లీలో తీసుకోవటంపై చర్చించారు. అసెంబ్లీ ఆవరణలో జయప్రకాశ్ నారాయణ, పాలడుగు వెంకట్రావుపై జరిగిన దాడికి సంబంధించి పూర్తి స్ధాయిలో విచారణ చేపట్టాలని ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ డీజీపీని కోరారు. నివేదిక రాగానే బాధ్యలుపై కఠిన చర్యలు తీసుకుంటామని నాదెండ్ల తెలిపారు. గవర్నర్ నరసింహన్‌తో శాసనసభ డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, శానసమండలి చైర్మన్ చక్రపాణి సమావేశమయ్యారు.
CM Kirankumar Reddy explained to the Congress high command about the incident took pkace in Assembly today. He called the leaders of the high command and explained.
Story first published: Thursday, February 17, 2011, 16:16 [IST]