అసెంబ్లీని ఇలాగే అడ్డుకుంటాం: తెలంగాణపై నాగం జనార్దన్ రెడ్డి

తెలంగాణ కోసం ఇంతకు ముందు ఇచ్చిన హామీలేవీ అమలు కాలేదని, ఇచ్చిన హామీలను కూడా తుంగలో తొక్కి కాంగ్రెసు తెలంగాణ ప్రజలను మోసం చేస్తోందని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొడుతున్నారని ఆయన అన్నారు. తెలంగాణ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నా కేంద్రానికి కనికరం రావడం లేదని ఆయన అన్నారు. తెలంగాణ కోసం అసెంబ్లీలో తీర్మానం ప్రతిపాదించే వరకు, పార్లమెంటులో బిల్లు ప్రతిపాదించే వరకు అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటామని ఆయన చెప్పారు. తమ శక్తి ఏమిటో చూపిస్తామని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీ మోసాలు ఇక ఏ మాత్రం సాగవని ఆయన అన్నారు. తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు ఎర్రబెల్లి దయాకర రావు, మోత్కుపల్లి నర్సింహులు కూడా మాట్లాడారు.
Comments
నాగం జనార్దన్ రెడ్డి తెలుగుదేశం శాసనసభ తెలంగాణ హైదరాబాద్ nagam janardhan reddy telugudesam assembly telangana hyderabad
English summary
TDP Telangana Forum Governor Nagam Janardhan Reddy said that they will obstruct Assembly proceedings, till the Telangana bill is proposed in Parliament. He said that Governor Narasimhan completed his speech and went way in the middle reflects the Telangana people's opinion.
Story first published: Thursday, February 17, 2011, 12:49 [IST]