ఇలా అయితే రాష్ట్రపతి పాలన, దాడి అమానుషం: ఎంపీలు రాయపాటి, లగడపాటి

గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం గానీ, జెపిపై దాడిగానీ సరికాదని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. రాజకీయాల్లో మార్పు కోసం వచ్చిన జెపిపై ప్రజాప్రతినిధులే దాడి చేయడం దుర్మార్గమన్నారు. ఇలాంటి దాడులు మరోసారి జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రబుత్వంపై ఉందన్నారు. కేంద్రం పరిధిలో ఉన్న అంశంపై దాడి చేయడం సరికాదన్నారు. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఉందన్నారు.












Click it and Unblock the Notifications