లోక్‌సత్తా జిల్లా అధ్యక్షుడిపై కర్రలతో టిఆర్ఎస్ దాడి, పరారీ
Districts
oi-Srinivas G
By Srinivas
|
మెదక్: లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణపై దాడి ఘటన తర్వాత మరికొన్ని గంటల్లోనే తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు మెదక్ జిల్లా లోక్‌సత్తా పార్టీ జిల్లా అధ్యక్షుడిపై దాడి చేశారు. తమ నేతపై దాడికి నిరసనగా మెదక్ జిల్లా జిల్లా అధ్యక్షుడు తుమ్మలపల్లి శ్రీనివాస్ సిద్దిపేటలో నిరసన కార్యక్రమానికి దిగారు. సిద్దిపేట చౌరస్తాలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నల్లబ్యాడ్జీలతో పార్టీ కార్యకర్తలతో కలిసి నిరసనకు పూనుకున్నారు. అయితే టిఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలు కొందరు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న శ్రీనివాస్, పార్టీ కార్యకర్తలపై గుంపులుగా వచ్చారు.
గుంపుగా వచ్చిన సుమారు 50 మంది టిఆర్ఎస్ కార్యకర్తలు కర్రలతో వచ్చి తీవ్రంగా దాడి చేసినట్టుగా తెలుస్తోంది. టిఆర్ఎస్ దాడిలో గాయపడ్డ శ్రీనివాస్ పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. శ్రీనివాస్‌ను స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా దాడి చేసిన టిఆర్ఎస్ కార్యకర్తలు పరారీలో ఉన్నారు. పోలీసులు వారికోసం గాలిస్తున్నారు.
Lok Satta ditrict president Tummanapalli Srinivas attacked by TRS followers today at Siddipeta of Medak district. 50
TRS followers with wooden sticks attacked, when they are tried to protest against attack on JP.
Story first published: Thursday, February 17, 2011, 16:40 [IST]