దానం నాగేందర్ సంగతేమిటో చూస్తాం: నాగం జనార్దన్ రెడ్డి వ్యాఖ్య

మీడియా స్వేచ్ఛను ముఖ్యమంత్రి హరిస్తే సహించబోమని ఆయన అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్‌గా కాకుండా ముఖ్యమంత్రిగా వ్యవహరించాలని ఆయన సలహా ఇచ్చారు. నిన్న ఆసెంబ్లీలో తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగానే వ్యవహరించామని, తమను సస్పెండ్ చేసినా అభ్యంతరం లేదని ఆయన అన్నారు. తమను తిరిగి ప్రజలు భారీ మెజారిటీతో అసెంబ్లీకి పంపిస్తారని ఆయన దీమా వ్యక్తం చేశారు. తెలంగాణపై కాంగ్రెసు స్పష్టమైన వైఖరి ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలు వీధుల్లోకి వస్తే వారిని అలాగే వదిలేసి మిగతా వ్యవహారాలు చూడడం సరి కాదని ఆయన అన్నారు.
శ్రీకృష్ణ కమిటీ నివేదికపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలను ఆయన ఉదహరించారు. నివేదికలోని ఎనిమిదవ చాప్టర్‌ను బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎవరి వాదనలను బట్టి, ఎవరి అభిప్రాయాలకు అనుగుణంగా శ్రీకృష్ణ 8వ చాప్టర్‌లో అంశాలను చేర్చారో, ఎందుకు దాన్ని రహస్యంగా ఉంచారో తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణవారిని దొంగలుగా, సంఘ విద్రోహ శక్తులుగా శ్రీకృష్ణ కమిటీ ఆ 8వ చాప్టర్‌లో చెప్పినట్లు తెలుస్తోందని, దాన్ని బయటపెట్టాలని ఆయన అన్నారు. అవసరమైతే శ్రీకృష్ణను కోర్టుకు లాగుతామని ఆయన హెచ్చరించారు.