విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ కేంద్రం పరిధిలో ఉంది, దాడి విచారకరం: మాజీ సిఎం రోశయ్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rosaiah
విజయవాడ: అసెంబ్లీలో గురువారం జరిగిన సంఘటనలు చాలా దురదృష్టకరమని మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య శుక్రవారం ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నర్ నరసింహన్ ప్రసంగాన్ని ఎమ్మెల్యేలు అడ్డుకోవడం, మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేపా దాడి చేయడం విచారకరమన్నారు. ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్నడూ చూడలేదని అన్నారు. అన్ని పార్టీలు ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందని సూచించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే రాష్ట్ర అభివృద్ధిపై ప్రభావం పడుతుందని హెచ్చరించారు. గురువారం నాటి సంఘటనలు దిగ్ర్భాంతికి గురి చేశాయన్నారు.

తెలంగాణ అంశం రాష్ట్ర పరిధిలో లేదని అన్నారు. అది కేంద్రం పరిధిలో ఉందని చెప్పారు. కేంద్రం త్వరలో దీనిపై స్పష్టమైన వైఖరి ప్రకటిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం ఉద్యోగులు సహాయ నిరాకరణ చేయడం సరికాదన్నారు. అలా చేయడం వల్ల ప్రజలే ఇబ్బంది పడతారని అన్నారు.

English summary
Former CM Rosaiah said today that Telangana solution is in central government court. He felt very much sad about yesterday's issue. He urged employees to withdraw non co-operation movement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X