హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రభుత్వానికి యాజమాన్యాల ఆల్టిమేటం: సిఎంను కలవాలని నిర్ణయం

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రభుత్వం ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలని ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు డిమాండ్ చేశాయి. ప్రభుత్వం ఇస్తామన్న 30 శాతం ఫీజు రీయింబర్సుమెంట్సు తమకు ఎటూ సరిపోవని, కనీసం 50 శాతం అయినా ఇవ్వాల్సిందేనని వారు డిమాండ్ చేశారు. ఆదివారం యాజమాన్యాలు సమావేశం అయ్యి బకాయిలపై చర్చించాయి. 50 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్స్‌‍ను ఈ నెల 23వ తేదీలోగా ఇవ్వాలని డెడ్‌లైన్ విధించాయి. ఈ నెల 23వ తేది వరకు ఫీజు బకాయిలలో సగం చెల్లించకుంటే ఇంతకుముందు నిర్ణయించుకున్నట్లుగా 24వ తారీఖు నుండి కళాశాలలు మూసి వేస్తామని హెచ్చరించాయి.

కాగా ఫీజు బకాయిల విషయంపై ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిని కలవలాని నిర్ణయించుకున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్స్ వెంటనే చెల్లించాలంటూ డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద వారం రోజుల నిరాహార దీక్ష చేపట్టిన మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీక్షకు సంఘీభావం ప్రకటించాలని కూడా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

English summary
Colleges management demanded government today for fifty percent of fee dues. They put 23rd of this month, 
 
 deadline to government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X