మావోయిస్టులు, ఒరిస్సా ప్రభుత్వంతో చర్చలకు బయలుదేరిన హరగోపాల్

Vineel Krishna
భువనేశ్వర్: మావోయిస్టులు కిడ్నాప్ చేసిన మల్కనగిరి కలెక్టర్ వినీల్ కృష్ణ విడుదల కోసం ఒరిస్సా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. వినీల్‌ను విడిపించేందుకు మానవ హక్కుల నేత ప్రొ.హరగోపాల్, ప్రొ. సోమేశ్వర్ రావు ఆదివారం హైదరాబాద్‌నుండి భువనేశ్వర్ బయలు దేరి వెళ్లారు. వారు భువనేశ్వర్‌లో నవీన్ పట్నాయక్‌ ప్రభుత్వంతో చర్చలు జరుపనున్నారు. వినీల్ కృష్ణ విడుదలకు మావోయిస్టులు ఏడు డిమాండ్లు పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఒరిస్సా ప్రభుత్వం మావోయిస్టులు పెట్టిన ఏడు డిమాండ్లకు ఒప్పుకునేలా ఉన్నట్టుగా కనిపించడం లేదు.

పోలీసుల అదుపులో ఉన్న ఆర్‌కె భార్య పద్మతో పాటు మరో నలుగురిని, గంటి ప్రసాద్‌ను, నల్లమలలో కూంబింగ్‌ను ఆపడం వంటి పలు డిమాండ్లు మావోయిస్టులు ప్రభుత్వం ముందు ఉంచారు. అయితే ఈరోజు మధ్యాహ్నం హరగోపాల్ నవీన్ ప్రభుత్వంతో చర్చలు జరిపిన అనంతరం ప్రభుత్వం ఏఏ డిమాండ్లకు ఒప్పుకుంటుందో తెలిసే అవకాశం ఉంది. కానీ మావోల అన్ని డిమాండ్లను మాత్రం అంగీకరించేందుకు సిద్ధంగా లేనట్లుగా తెలుస్తోంది. ఈరోజు సాయంత్రంగానీ, రేపు గానీ హరగోపాల్ మావోయిస్టులతో చర్చలు జరిపే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+