పార్లమెంటును తాకిన తెలంగాణ సెగ: ఫ్లకార్డుల ప్రదర్శన

కాగా అనంతరం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కె కేశవరావు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావును తెలంగాణ కోసం తమతో కలిసి రమ్మంటే ఆయన మాత్రం రావడం లేదన్నారు. టిడిపి తెలంగాణ కోసం కాంగ్రెస్‌తో కలిసి మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ధర్నా చేసిందని, ఇది తెలంగాణకు శుభపరిణామమని అన్నారు. ఇటీవల ఎమ్మెల్యేలు తెలంగాణపై స్పష్టత కోసం వచ్చారని, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీని కలవడానికి రాలేదన్నారు. కేంద్ర మంత్రులనుండి తెలంగాణపై స్పష్టమైన వైఖరి లేకుంటేనే సోనియాగాంధీని కలుస్తామని చెప్పారని, అయితే మంత్రులనుండి స్పష్టమైన వైఖరి లభించినందునే వారు సోనియాకాంధీని కలవలేదన్నారు.
టిఆర్ఎస్ సిరిసిల్ల శాసనసభ్యుడు కె తారకరామారావు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను విమర్శించడం సరికాదన్నారు. ఆయన ఆరోపించినట్లు వారు సోనియా అపాయింట్‌మెంట్ కోసం రాలేదని వివరణ ఇచ్చారు. అందరూ కలిసి పోరాడితేనే తెలంగాణ వస్తుందని అన్నారు. రాష్ట్రంలో తెలంగాణ సమస్య పరిష్కారం కాదని, ఒత్తిడి తేవాలనుకుంటే న్యూఢిల్లీలో తీసుకు రావాలని ఆయన కేసిఆర్‌కు సూచించారు. సోనియా నాయకత్వాన్ని బలపరుస్తూనే నిరసన తెలిపాం అని చెప్పారు.












Click it and Unblock the Notifications