ప్రభుత్వం బడ్జెట్ అంకెల గారడి: బిజెపి ఎమ్మెల్యే కిషన్ రెడ్డి

కృష్ణా నీటిని హైదరాబాద్‌కు తరలిస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు పూర్తిస్థాయిలో జరగలేదన్నారు. గోదావరి నీటిని ఎప్పుడు తీసుకు వస్తారో కూడా చెప్పలేదన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్స్ కేటాయింపులపై కూడా సరిగా లేదన్నారు. బడ్జెట్‌ను పెంచింది కానీ ఇది బోగస్ అన్నారు. 32 పేజీల బడ్జెట్ వాస్తవాలకు విరుద్దంగా ఉందన్నారు. ఈ బడ్జెట్ అమలు కానీ బడ్జెట్ అన్నారు. తెలంగాణలో సహాయ నిరాకరణ వల్ల ఆదాయం రాదని, అయితే ప్రభుత్వం మాత్రం లాభం ఉంటున్నట్లుగా చూస్తుందన్నారు. ఆదాయం తగ్గినప్పటికీ అంకెల గారడీ చూపించిందన్నారు. ప్రజలను అయోమయానికి గురిచేసే బడ్జెట్ అన్నారు. ప్రభుత్వం ప్రింటింగ్ ప్రెస్‌లో ప్రింట్ అయింది కాబట్టి వాళ్ల ఇష్టానుసారంగా ఉందన్నారు.
Comments
English summary
BJP MLA G.Kishan Reddy opposed annual budget proposed by Finance Minister anam Ramanarayana Reddy at media point on wednesday. He said budget is number magic. He demanded to release previous year amount.
Story first published: Wednesday, February 23, 2011, 13:49 [IST]